క్లిష్ట సమయంలో హైదరరాబాద్ ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వరద సాయం బాధితులందరికి అందిస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.



 


‘మేం ఒక్కరోజే లక్ష మందికి వరద సాయం పంపిణీ చేశాము. తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మాత్రం బురద రాజకీయం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే కనీసం స్పందన లేదు. తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయ మంత్రా చెప్పాలని’ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు.



 



 


‘హైదరాబాద్‌లో ఇప్పటివరకు 4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరదసాయం అందింది. ఇప్పటివరకు వరదసాయం అందిన బాధితుల వివరాలను కూడా సేకరించాం. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించాం. 920 బృందాలను ఏర్పాటు చేసి వరద సాయం అందించాము. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వివరాలు అందిస్తే బాధితుల ఇంటికే వచ్చి సాయం అందించనున్నట్లు’ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe