TS Assembly Sessions 2022: తెలంగాణ అసెంబ్లీలో కేంద్రాన్ని ఏకిపారేసిన మంత్రి హరీశ్ రావు
Harish Rao Speech in TS Assembly : లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపి ఇచ్చిన హామీలను ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు.. ఆయా హామీలు, పథకాలు, సంస్థల ఏర్పాటులో తెలంగాణకు దక్కింది ఏమీ లేదంటూ పెద్ద చిట్టాను చదివి వినిపించారు.
TS Assembly Sessions 2022: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు కేంద్రంలోని మోదీ సర్కారుని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవీ వారి పరిపాలనలో నెరవేరలేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బీజేపి ఇచ్చిన హామీలను ప్రస్తావించిన హరీశ్ రావు.. విదేశాల నుంచి నల్లధనం తెస్తామని అన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారని అన్నారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనం భారత్ కి తెప్పించి పేదల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని అన్నారు. అందులోనూ ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. డిమానిటైజేషన్ తీసుకొచ్చి నల్లధనం అరికడతాం అని ప్రకటించారు కానీ పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు.
వ్యవసాయం లాభసాటిగా చేసి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. రైతులను ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఎం.ఎస్.ఎం.ఈలకు గంటలోపల రుణాలు అందించేలా విధానాలు తీసుకొస్తామన్నారు. అందులోనూ విఫలయ్యారు. దేశవ్యాప్తంగా అర్హులైన నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. మేకిన్ ఇండియా నినాదంతో దేశంలోనే అన్ని తయారయ్యేలా ప్రోత్సహిస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తీసుకొస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. నమామి గంగే పేరుతో గంగానదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. విఫలమయ్యారు. నదుల అనుసంధానంతో సముద్రం పాలయ్యే నీటిని వృధాకాకుండా చూస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. దేశంలో వేళ్లూనుకుపోతున్న టెర్రరిజంను కూకటి వేళ్లతో పెకిలిస్తాం అని శపథం చేశారు. ఫెయిల్ అయ్యారు. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫెయిల్ అయ్యారు. హర్ ఘర్ జల్ నినాదంతో ఇంటింటికీ మంచి నీరు అందిస్తామన్నారు. ఇందులో కూడా ఫెయిల్ అయ్యారని చెబుతూ కేంద్రం ఇచ్చిన హామీలను మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ఏకరువు పెట్టారు.
దేశంలో గత ఏడేండ్ల బీజేపీ పాలనలో కొత్తగా 7 ఐఐఎంలు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కేటాయిస్తే అందులో తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపించారు. అలాగే 7 ఐఐటీలు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటు చేస్తే అందులోనూ తెలంగాణకు ఇచ్చినవి సున్నానే అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఐఐఎస్‌ఈఆర్‌లు రెండు నెలకొల్పగా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.
దేశవ్యాప్తంగా 16 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు. దేశంలో నాలుగు ఎన్‌ఐడీలు ఏర్పాటు చేయగా.. తెలంగాణకు కేటాయించినవి సున్నా. వివిధ రాష్ట్రాల్లో మొత్తం 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయగా.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా! కొత్తగా 84 జవహార్ నవోదయ విద్యాలయ సంస్థలు ఏర్పాటు చేసిన కేంద్రం, అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు అని చెబుతూ వీటిని తెప్పించేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేస్తున్న కృషి కూడా అంతే పెద్ద గుండు సున్నా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తెలంగాణలోని బీజేపి ఎంపీలను, నాయకులను ఎద్దేవా చేశారు.
Also Read : September 17th 2022: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెచ్చే మార్పులపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Also Read : Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి