కరోనా కేసులు ( Corona cases )  రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన అన్ని ప్రవేశపరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఎంట్రన్స్ పరీక్షల్ని ( All Entrance Exams postponed ) వాయిదా వేయాలంటూ హైకోర్టులో ( Pil in High court )  దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. లాక్ డౌన్ విధిస్తే...పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారంటూ కోర్టు ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. Also read : ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు కేరళ నర్సులు లాక్ డౌన్ పై ( Lockdown ) స్పష్టత వచ్చిన తరువాతే పిటీషన్ పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ నిర్ణయంపై ఆధాపడిఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. అనంతరం అన్ని ప్రవేశపరీక్షల్ని వాయిదా వేస్తూన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఎంసెట్ తో సహా పాలిసెట్ , ఐసెట్ వంటి అన్ని పరీక్షలు తదుపరి నిర్ణయం వెలువడే వరకూ వాయిదా పడ్డాయి. Also read : LockDown: తెలంగాణలో భారీగా బాల్య వివాహాలు