తెలంగాణలో కరోనా కేసులు(CoronaVirus cases In Telangana) విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులన్నీ రద్దీగా మారాయి. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశిక్షుతులైన నర్సుల సేవల అవసరం అధికమైంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 12 వేలు దాటేశాయి. ఇవి కాకుండా ఇతరత్రా రోగాలు, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వచ్చేవారు ఎక్కువయ్యారు. దాంతో ఆసుపత్రుల్లో రద్దీ పెరిగి నర్సుల(Nurses) అవసరం భారీగా ఏర్పడింది. Mann Ki Baatలో చైనాకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
అందులోనూ కోవిడ్19 వంటి మహమ్మారి కావడంతో సుశిక్షితులైన నర్సుల కొరత ఎక్కువైంది. ఇక్కడి ఆస్పత్రులకు, బెస్ట్ నర్సులంటే మనకు గుర్తొచ్చేది కేరళనే. హైదరాబాద్‌లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులు 50 మంది నర్సుల్ని కేరళ(Kerala Nurses) నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ ఫ్లైట్స్ ద్వారా తీసుకొచ్చారు. వెల్ ట్రైన్డ్ నర్సులు కావడంతో డాక్టర్లకు సమానం, అధిక జీతాలివ్వడానికి కూడా ఆస్పత్రి యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 12 మంది మృతి
కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయినా సరే నర్సుల్ని తక్షణమే నియమించుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని... ఒక్కో నర్సుకు రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా నర్శులకు ఇచ్చే జీతం కంటే ఇది కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. . జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ