TRS mlas Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడే హైకోర్టులో విచారణ.. అందరిలోనూ ఉత్కంఠ
TS High Court On TRS mlas Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
TS High Court On TRS mlas Poaching Case: అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సీఎం కేసీఆర్ వీడియోలను బయటపెట్టడం సంచలనంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులను రామచంద్ర భారతి, సింహయాజులు, నందులు ప్రలోభ పెట్టేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితులు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
మరోవైపు బీజేపీ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫామ్‌హౌజ్ వ్యవహారంపై సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని బీజేపీ కోరింది.
అయితే మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కేసు దర్యాప్తును ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణలో సీబీఐ ఎంటర్ కావడానికి వీళ్లేదని ప్రభుత్వం జీవో 51 తెచ్చిందని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టుకు విచారణకు చేపట్టింది. ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్స్ తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తుందన్న పిటిషనర్ ఆరోపిస్తున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్-5 (2) నిబంధనలు అతిక్రమించి ఫోన్ ట్యాప్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాప్‌తోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఫోన్ టాంపరింగ్‌పై సమగ్ర విచారణ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.
సీబీఐ విచారణపై బీజేపీ వేసిన పిటిషన్‌తో పాటు కలిపి ఫోన్ ట్యాపింగ్ పిటిషన్‌ను హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. హైకోర్టు ఏం చెబుతుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook