Mohammad Nawaz Runout: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్-బి నుంచి సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. గురవారం సౌతాఫ్రికాను పాకిస్థాన్ ఓడించి సెమీస్ రేసులోకి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 185 పరుగులు చేసింది. ఇఫ్తికార్ 51, షాదాబ్ 52 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా తరఫున అన్రిచ్ నార్కియా అద్భుతంగా బౌలింగ్ చేసి.. 41 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ రూల్సో ప్రకారం సఫారీ జట్టుకు 14 ఓవర్లలో 142 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 108 పరుగులకే పరిమితం కావడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. తబ్రేజ్ షమ్సీ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు నవాజ్ ప్రయత్నించాడు. కానీ అది అతని ప్యాడ్‌లకు తగిలింది. దీంతో బౌలర్, వికెట్ కీపర్ ఎల్బీడబ్యూ కోసం గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఈలోపు నవాజ్ కూడా పరుగు కోసం క్రీజ్‌ను వదిలి ముందుకు పరిగెత్తాడు. సఫారీ ఫీల్డర్లు వెంటనే అతడిని రనౌట్ చేశారు. ఇలా ఒకే బంతికి నవాజ్ రెండుసార్లు ఔట్ అయ్యాడు.
అయితే ఐసీపీ నిబంధనలు తెలిస్తే.. నవాజ్ ఔటయ్యే వాడు కాదు. ముందుగా బంతి అతని బ్యాట్‌కి తగిలి ప్యాడ్‌కు తగిలినా డీఆర్‌ఎస్ తీసుకోలేదు. తాను రనౌట్ అయ్యానని అనుకుని పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. నింబంధనల ప్రకారం అంపైర్ ఔటిచ్చిన తరువాత డెడ్ బాల్ అవుతుంది. అంపైర్ వేలు పైకి ఎత్తిన తరువాత ఫీల్డర్లు రనౌట్ చేసినా అది పరిగణలోకి రాదు. అంపైర్ ఎల్బీడబ్యూ ఇచ్చిన తరువాత నవాజ్ డీఆర్ఎస్ తీసుకుని ఉంటే నాటౌట్‌గా మిగిలేవాడు. అయితే ఆ టెన్షన్‌లో రూల్ గుర్తుకు రాకపోవడంతోనో.. లేక తెలియకపోవడంతోనో రనౌట్ అయ్యాననుకుని డౌగౌట్‌కు వెళ్లిపోయాడు. నవాజ్ 22 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
గతంలో ఇలానే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అండర్సన్ ఔటయ్యాడు. 2015 ప్రపంచ కప్‌లో ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. జేమ్స్ టేలర్‌ను ఎల్బీడబ్యూగా అంపైర్ ప్రకటించాడు. ఈలోపే టేలర్, అండర్సన్ పరుగు కోసం ప్రయత్నించగా.. అండర్సన్‌ను ఆసీస్ ఫీల్డర్ మ్యాక్స్‌వెల్ రనౌట్ చేశాడు. టేలర్ డీఆర్ఎస్ కోరగా.. రిప్లైలో నాటౌట్ అని తేలింది. అయితే అండర్సన్‌ను రనౌట్‌గా ప్రకటించారు. అయితే నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తరువాత డెడ్ బాల్ అవుతుందని.. రనౌట్ ఇవ్వడం తప్పేనని అప్పట్లో ఐసీసీ కూడా ఒప్పుకుంది.
Also Read: Twitter Server Down: ట్విట్టర్ సర్వర్ డౌన్.. వినియోగదారులకు షాక్.. ఇలాంటి మెసేజ్ వచ్చిందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook