TS inter second year exams cancellation GO: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ జూన్ 9న సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను వెల్లడికి అవసరమైన విధివిధానాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఈ జీవో ద్వారా తెలంగాణ స్టేట్ ఇంటర్మిడియెట్ బోర్డ్ (TSBIE) అధికారులను ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: TS POLYCET 2021: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు


ఇదిలావుంటే, ఇంటర్ సెకండీయర్‌లోకి ప్రమోట్ అయిన విద్యార్థులకు జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు (Online classes) ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరబోయే విద్యార్థులకు జూలై 5 వరకు తొలి విడత ప్రవేశాలు, ఆ తర్వాత విడతల వారీగా అడ్మిషన్స్ పూర్తి చేస్తూనే వారికి కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Minister Sabitha Indra Reddy) నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.


Also read: TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు