Covid19 Command Center in Hyderabad: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. నేడు హైదరాబాద్‌లోని వెంగ‌ళ్రావు న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన‌ కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించిన మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరింస్తుందన్నారు. శాంతి కోసం ఎంతగా శ్రమిస్తే యుద్ధంలో మనం అంత తక్కువ రక్తాన్ని చిందించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోవిడ్19 కంట్రోల్ రూమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఐటీ శాఖ కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Also Read: Gold Rate Today In Hyderabad 25 June 2021: దిగొచ్చిన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు,లేటెస్ట్ రేట్లు ఇలా



మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటన ప్రారంభించారు. మంత్రులను సైతం పలు జిల్లాల్లో కార్యక్రమాలు, శంకుస్థాపన పనులు, రైతు బంధు పంపిణీ పనులను పర్యవేక్షించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాల బెడద లేకుండా చూడటంతో పాటు ఎరువులను అధిక ధరలకు విక్రయాలు జరగకుండా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.


Also Read: Telangana Inter Colleges Reopen: నేటి నుంచి తెలంగాణ‌లో కాలేజీలు ప్రారంభం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook