Hyderabad: లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
Hyderabad మహానగరం కుండపోత వర్షాలతో ‘విశ్వనరకం’లా తయారైంది పరిస్థితి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains In Hyderabad) కాలనీలు, రోడ్లు చెరువులు, జలాశయాలను తలపిస్తున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) మహానగరం కుండపోత వర్షాలతో ‘విశ్వనరకం’లా తయారైంది పరిస్థితి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains In Hyderabad)కు కాలనీలు, రోడ్లు చెరువులు, జలాశయాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ నేటి ఉదయం నిర్ణయం తీసుకుంది. వరదనీటిలో పది మందికి పైగా గల్లంతయ్యారు. నేటి ఉదయం వరకు 11 మంది చనిపోయారని సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (TS Minister KTR) ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడక్కడా మంత్రి కేటీఆర్‌ను స్థానికులు నిలదీస్తున్నారు. బైరామల్ గూడ ప్రాంతంలో హోం మంత్రి మహమూద్ అలీ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల వారిని పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో నీటిని త్వరగా బయటకు తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు సూచించారు.
- Also Read : Hyderabad Rains: నగరంలో 11కు చేరిన మృతుల సంఖ్య
భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన రామంతాపూర్, హబ్సిగూడ పరిసర ప్రాంతాలను మంత్రులు కేటీర్, మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పరిశీలించారు. వర్షాల కారణంగా స్థానికంగా ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe