Total 11 deaths have been registered in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 11కు చేరింది. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని గౌస్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతోపాటు శంషాబాద్‌లోని గగన్‌పహాడ్ ప్రాంతంలో కూడా రాత్రి ఇంటి గోడ కూలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఇప్పటివరకు 11మంది మరణించారని అధికారులు వెల్లడించారు. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ
Telangana: Three people lost their lives after wall of a house collapsed in Gaganpahad area of Shamshabad in Hyderabad last night, owing to heavy rainfall.
Total 11 deaths have been registered in Hyderabad due to incessant downpour, since last night. pic.twitter.com/xLdJDHpbyY
— ANI (@ANI) October 14, 2020
నగరం మొత్తం నీటితో దర్శనమిస్తోంది. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు వెల్లడిస్తున్నారు. వరద ప్రవాహంలో వందలాది వాహనాలు నీటిలో మునిగిపోగా.. పదుల సంఖ్యలో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రాత్రంతా నగర వాసులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో గడిపారు. పలు ప్రాంతాల్లో అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో నగరంలో ఆందోళన మరింత పెరిగింది.
#WATCH Telangana: Heavy rainfall in Hyderabad triggers waterlogging and flooding in different parts of the city. pic.twitter.com/Mf81A6UAum
— ANI (@ANI) October 14, 2020
అయితే మరో రెండు, మూడురోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా హెల్స్ లైన్ నెంబర్లను కూడా జారీ చేసి నగరంలో అలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రకటించింది. Also read: Hyderabad Rains: ఇళ్లు కూలి 8మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe