TS PECET 2023 Results will Be Released on  https://pecet.tsche.ac.in/ : టీఎస్‌పీఈ సెట్-2023 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, శాతవాహన వర్సిటీ వీసీ మల్లేశ్ రిలీజ్ చేయనున్నారు. అభ్యర్థులు https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని బీపెడ్, డీపెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌   (పీఈసెట్)ను నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు..


==> అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  https://pecet.tsche.ac.in/ లోకి వెళ్లండి.
==> ఇక్కడ TS PECET-2023 Results అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. 
==> మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లేపై ప్రత్యక్షం అవుతుంది.
==> భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ లేదా పీడీఎఫ్‌ ఫైల్ డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి
==> అడ్మిషన్ ప్రక్రియలో ఈ ర్యాంక్ కార్డు తప్పకుండా అవసరం అవుతుంది. 


మరోవైపు పేపర్ లీక్ ఘటన తరువాత రద్దు అయిన పరీక్షల విషయంలో టీఎస్‌పీఎస్‌సీ వేగం పెంచింది. మళ్లీ నిర్వహించనున్న పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతో కీలకమైన గ్రూప్-1 ఎగ్జామ్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది. అతి త్వరలోనే ప్రైమరీ కీను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కీ విడుదల తరువాత.. తుది ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా గ్రూప్-1 మెయిన్ ఎగ్జామ్స్‌ తేదీలపై కూడా దృష్టిపెట్టనుంది. పేపర్ లీక్ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో.. అన్ని పరీక్షలను అధికారులు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న పొరబాటు జరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి   


Also Read: విండీస్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్‌పై వేటు.. శాంసన్, జైస్వాల్‌కు చోటు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook