TS RTC Sankranti special: ఛార్జీల పెంపు లేకుండానే సంక్రాంతి స్పెషల్ బస్సులు: టీఎస్ ఆర్టీసీ
TS RTC Sankranti special: సంక్రాతి పండుగ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలకు భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
TS RTC Sankranti special: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ నేపథ్యంలో ప్రయాణాల కోసం 4,318 స్పెషల్ బస్సులు (TS RTC Sankranti special buses) అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అయితే ప్రత్యేక బస్సుల్లో సైతం అదనపు ఛార్జీలు ఉండవని (TS RTC Sankranti offer) స్పష్టం చేసింది.
అందుకే ఈ నిర్ణయం..
సంక్రాతి వచ్చిందంటే.. హైదరాబాద్ నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. దీనితో హైదరాబాద్‌లోని బస్టాండ్లు.. ప్రధాన కూడళ్లు జనాలతో కిక్కిరిసిపోతాయి. ఇదే అదనుగా ట్రావెల్ సంస్థలు రెట్టింపు ధరకు టికెట్లు విక్రయిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. ప్రయాణికులను ఆకర్షించేందుకు భారీగా స్పెషల్ బస్సులతోపాటు.. టికెట్ ధరలను సైతం పెంచకూడాదని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం (TS RTC Sankranti new Offers) తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పెషల్ బస్సులు ఈ నెల 7 నుంచే ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది (TS RTC Sankranti special buses form 7th Jan) టీఎస్ ఆర్టీసీ. తెలంగాణతో పాటు ఏపీలో వివిధ జిల్లాలకు సైతం స్పెషల్ బస్సులు నడుస్తాయని పేర్కొంది.
స్పెషల్ బస్సులు ఎక్కడి నుంచి?
స్పెషల్ బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు నడవనున్నాయి. నగరంలోని ఎంజీబీస్, జేబీఎస్ సహా ప్రధాన కూడళ్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
చివరి నిమిషంలో సీటు దొరక్క ఇబ్బంది పడకుండా.. ముందుగానే సీటు బుక్ చేసుకునే (TS RTC Online Booking Servises) అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ వివరించింది. టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చని తేలింపింది.
Also read: Corona in Telangana: తెలంగాణలో కరోనా కోరలు- కొత్తగా 1,913 మందికి పాజిటివ్
Also read: Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook