TS Tenth Results 2023: తెలంగాణలో మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదల అవ్వగా.. ఒక్కరోజు వ్యవధిలోని పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. పది ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పరీక్ష ఫలితాల విడుదల సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు లేకుండా అధికారులు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులు tsbie.cgg.gov.in, bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్‌లలో రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలోనే కాకుండా.. ఇతర వెబ్‌సైట్లలో కూడా పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4.8 లక్షల మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే.. పరీక్షా పేపర్ల మూల్యాంకనం ప్రారంభించారు అధికారులు. మొత్తం 18 సెంటర్లలో వాల్యూయేషన్ నిర్వహించారు. అయితే అప్‌లోడింగ్ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగింది. ఎక్కడ ఎలాంటి తప్పుదొర్లకూడదని అధికారులు చాలా జాగ్రత్తగా ఫలితాలను అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అన్ని ఒకే అనుకున్న తరువాతనే నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.


ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..


==> స్టెప్ 1: బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://bse.telangana.gov.in/ లోకి సందర్శించండి.
==> స్టెప్ 2: హోమ్‌పేజీలో "ఫలితాలు" విభాగంపై క్లిక్ చేయండి. 
==> స్టెప్ 3: మీరు "SSC ఫలితాలు 2023"ని పేజీలోకి వెళతారు.
==> స్టెప్ 4: ఇక్కడ మీ హాల్ టిక్కెట్ నంబర్ ఎంటర్ చేయండి.
==> స్టెప్ 5: అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
==> స్టెప్ 6: మీ టెన్త్ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.


Also Read: Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!  


Also Read: IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి