Telangana 10th Class Supplementary Results: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు నిర్వహించారు. స్పాట్ వాల్యూయేషన్ ఈ నెల 14 నుంచి 19వ తేదీ జరిగింది. పరీక్షలకు మొత్తం 51,272 అప్లై చేసుకోగా.. 46,731 మంది హాజరయ్యారు. ఇందులో 34,126 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 73.03గా నమోదైంది. బాలురు 71.01 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా.. బాలికలు 76.37 శాతం మంది పాస్ అయ్యారు. నిర్మల్ జిల్లా 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. వికారాబాద్ 42.14 శాతంతో చివరిస్థానంలో ఉంది. విద్యార్థులు ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా https://www.manabadi.co.in/ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: US woman flight: ‘థాంక్యూ సర్’ అనడమే ఆమె చేసిన పాపం.. విమానం నుంచి దించేసిన సిబ్బంది.. వీడియో వైరల్..


తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల రిజల్ట్స్‌ను ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో 91.31 శాతం మంది పాస్ అయ్యారు. బాలురులో 89.41 శాతం, బాలికలు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్ 100 శాతం ఫలితాలు రాగా.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో ఫలితాలు వచ్చాయి. 99.06 శాతంతో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్‌లో నిలవగా.. 66 శాతం ఫలితాలతో వికారాబాద్‌ చివరి ప్లేస్‌లో నిలిచింది. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 4,94,207 మంది రెగ్యులర్ విద్యార్ధులు కాగా.. మరో 11,606 మంది విద్యార్ధులు ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.


Also Read: Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter