హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల భారీ వరదలు పోటెత్తిన కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వరద సాయం కోసం నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వరద బాధితులు మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రభుత్వం ఇచ్చే ఆ ఆర్థిక సహాయం ఏదో ఓ అవసరానికి వస్తాయని భావించిన వరద బాధితులు మీ సేవ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూస్తుండగానే.. బాధితులకు షాక్‌నిస్తూ వరద సాయం నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  ( GHMC elections code ) అమలులోకి వచ్చిన కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదసాయం పంపిణి నిలిపేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ, ఆర్థిక సాయం పంపిణీని నిలిపివేసి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ( GHMC elections results ) వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.


Also read: GHMC Elections : నామినేషన్ల సందడి షురూ, అభ్యర్థుల లిస్ట్ సిద్ధం చేస్తున్న పార్టీలు


వరద సాయం జీహెచ్ఎంసీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా ఆ కార్యక్రమాన్ని నిలిపేయాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ( TSEC ) తెలిపింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన వెంటనే మళ్లీ యధావిధిగా వరద సాయం అందనుంది.


Also read : BJP, Janasena alliance: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపి క్లారిటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి