Update on TSPSC Group-1 Key : తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ప్రిలిమినరీ కీ ను వచ్చే వారంలో రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రిలిమ్స్ కీతోపాటు ఓఎంఆర్ పత్రాల కాపీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు 2,33,248 మంది హాజరయ్యారు. 2022 అక్టోబరు 16న జరిగిన పరీక్షతో పోలిస్తే దాదాపు 55 లక్షల మంది ఈ పరీక్షకు దూరంగా ఉన్నారు. ఇమేజింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రిలిమనరీ పరీక్ష మాస్టర్‌ ప్రశ్నపత్రం అందుబాటులోకి తేనున్నారు.  కీ పై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీ విడుదల చేయనుంది. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది. 


రాష్ట్రంలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశించాలంటూ జూన్‌ 21న, బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్‌ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను వేశారు. దీనిపై ఇవాళ అంటే గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గతంలోనే నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష ముగిసిన తర్వాత తొలిసారి పిటిషన్ నమోదైంది.


Also Read: Hyderabad Rains: రుతుపవనాలొచ్చేశాయి, వర్షాలతో పులకరించిన హైదరాబాద్, సేద తీరిన జనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి