ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  తెలంగాణ సర్కార్ పలు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్  కమిషన్( టీఎస్‌పీఎస్సీ) కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. మొత్తం 2786 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భర్తీ కానున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి: 700 వీఆర్వో, 474 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎస్‌వో)/అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌వో), 1,521 గ్రూప్‌–4 పోస్టులు, ఆర్టీసీలో 72 జూనియర్‌ అసిస్టెంట్‌ పర్సనల్, జూనియర్‌ అసిస్టెంట్‌ ఫైనాన్స్‌ పోస్టులు, రెవెన్యూ విభాగం, హోంశాఖల్లో 19 సీనియర్‌ స్టెనో పోస్టులు న్నాయి. పోస్టులు, అర్హతలు, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. రెవెన్యూ, అటవీ సహా ఇతర విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా జూన్ 2న ప్రకటిస్తామన్న మధ్యంతర భృతి ప్రకటనను ప్రభుత్వం వాయిదా వేసింది.


విభాగాల వారిగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు: రెవెన్యూశాఖలో ఎల్‌డీ, జూనియర్ స్టేనో 15, టైపిస్ట్ 292, జూనియర్ అసిస్టెంట్స్ 217, పంచాయతీరాజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంట్స్ 53, టైపిస్ట్ 64, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 231, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 32, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్స్ 22, సీనియర్ స్టెనో 6, జూనియర్ స్టెనో 335, టైపిస్ట్ 79 పోస్టులు తో పాటు పలు విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగనుంది. పోస్టులు, అర్హతలు, పూర్తి వివరాలను tspsc వెబ్‌సైట్‌లో చూడవచ్చు.