TSRTC Bus Fares Hiked: చార్జీల పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాకిచ్చిన టిఎస్ఆర్టీసీ
TSRTC Bus Fares Hiked: టిఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ బ్యాడ్ న్యూస్. ప్రయాణికులపై మరింత ఆర్థిక భారం పడేలా టిఎస్ ఆర్టీసి ప్రత్యేకంగా టోల్ సెస్ బాదుడు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
TSRTC Bus Fares Hiked: టిఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ బ్యాడ్ న్యూస్. ప్రయాణికులపై మరింత ఆర్థిక భారం పడేలా టిఎస్ ఆర్టీసి ప్రత్యేకంగా టోల్ సెస్ బాదుడు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, టోల్ చార్జీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని సంస్థపై పడకుండా ఆర్టీసి టికెట్ చార్జీల పెంపు రూపంలో టిఎస్ఆర్టీసీ ప్రయాణికులపైకి బదిలీ చేసింది. టోల్ సేస్ పేరుతో వసూలు చేస్తోన్న మొత్తాన్ని టిఎస్ ఆర్టీసి భారీగా పెంచింది.
టోల్ సెస్ పేరిట టిఎస్ఆర్టీసీ చార్జీల పెంపు ఈ విధంగా ఉంది.
ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల్లో టికెట్ పై రూ. 6 నుండి రూ. 10 రూపాయలు వరకు పెంచారు.
డిలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్స్ పై రూ. 9 నుంచి రూ. 13 రూపాయలు వరకు
మిగతా ఏసి బస్సుల్లో టికెట్స్ పై రూ. 14 నుంచి రూ. 20 వరకు చార్జీలు పెంచారు.
ఉదాహరణకు కొన్ని రూట్స్‌లో టోల్ సెస్ పెంపు అనంతరం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలు
హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు గతంలో రూ. 140 గా ఉండగా అది రూ. 145 కి పెరిగింది.
హైదరాబాద్ నుంచి ఖమ్మం మార్గంలో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ధర రూ. 270 నుంచి రూ. 290 కి పెరిగింది.
హైదరాబాద్ నుంచి కొత్తగూడెం మార్గంలో టిఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టికెట్ ధర రూ. 347 నుంచి రూ. 390 కి పెంచారు.
ఇది కూడా చదవండి : TSPSC Paper Leak: రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్.. మీకర్థమవుతోందా.. పరువు గల కేటీఆర్ గారూ..!
ఇది కూడా చదవండి : YS Sharmila: అరుదైన సంఘటన.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK