హైద‌రాబాద్ : కొవిడ్-19 నేపథ్యంలో తమకు రావాల్సిన వేతనాలు బకాయి పడటంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేత‌నాల్లో విధించిన కోత మొత్తాన్ని ఇక తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కరోనా నేపథ్యంలో 2 నెల‌ల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని తిరిగి చెల్లించాల‌ని సీఎం కేసీఆర్ తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి బకాయి పడిన రెండు నెలల జీతాన్ని చెల్లించేందుకు వెంటనే రూ 120 కోట్లు విడుద‌ల చేయాల‌ని అన్నారు. అలాగే హైద్రాబాద్‌లో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్న ఆర్టీసీపై ( TSRTC ) కరోనా మరోసారి తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. ఎన్ని నష్టాలు వచ్చినా ఆర్టీసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తోడ్పాటును అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గుర్తుచేశారు. 


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


ఈ సమీక్షా సమావేశంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, ఆర్టీసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి