TSRTC Two More DA's: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఉద్యోగులకు మరో రెండు డీఏలను ప్రకటించేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. జులై, ఆగస్టు నెలల్లో ఈ రెండు డీఏలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండూ కలిపి 9 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం 5 శాతం డీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో రెండు డీఏలు కూడా వస్తే... ఆర్టీసీలో జూనియర్ డ్రైవర్, కండక్టర్ల వేతనాలు రూ.1300, సీనియర్ డ్రైవర్, కండక్టర్ల వేతనాలు రూ.2000 మేర పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారుల వేతనాలు స్థాయిని బట్టి రూ.3800 నుంచి రూ.10 వేల వరకు పెరగనున్నాయి. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు ఇప్పటివరకూ 6 విడతల డీఏ బకాయి పడింది. 2019 జులై నుంచి డీఏ పెంపు చేపట్టలేదు. దీంతో ఉద్యోగులకు రావాల్సిన 40.9 శాతం డీఏ నిలిచిపోయింది. 


డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ మరింత నష్టాల బాటపట్టిన సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వంద రోజుల ప్రణాళిక ప్రారంభించారు. ఇందుకోసం ఉద్యోగులు కృషి చేయాల్సి ఉన్నందునా... వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు ఇటీవల 5 శాతం డీఏ పెంపు చేపట్టారు.


Also Read: KGH Ambulance Mafia: విశాఖలోని కేజీహెచ్ లో దారుణం.. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వద్దన్నందుకు బాలింత భర్తపై దాడి!


Also Read: Ganesh Puja Tips: బుధవారం గణపతి పూజ... ఈ నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook