TSRTC Strike updates| టిఎస్ఆర్టీసీ సమ్మెపై అశ్వత్థామ రెడ్డి తాజా ప్రకటన
టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి(Ashwathama Reddy) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది.
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె(TSRTC Strike) ఆగలేదని.. సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉందని టిఎస్ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ(TSRTC JAC) నేతల సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana govt) కార్మికులపై ఎలాంటి షరతులు విధించకుండా విధుల్లో చేర్చుకుంటామంటే.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసి కోరినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంపైనే నేడు నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీపై సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. నవంబర్ 23న ఆదివారం నాడు ప్రొ.జయశంకర్ చిత్ర పటాలకు నివాళులర్పించి డిపోల ఎదుటే నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని.. అలాగే ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు నిరసన తెలియజేయాలని అశ్వత్థామ రెడ్డి (Ashwathama Reddy)పిలుపునిచ్చారు. రేపటి ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని.. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కానందున కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.
Read also : TSRTC Strike | ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై అశ్వత్థామ రెడ్డి కీలక ప్రకటన
ఇక ఇదిలావుంటే, ఏ విధంగా చూసుకున్నా ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్న సీఎం కేసీఆర్(CM KCR).. రాష్ట్రంలో 50% రూట్లను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు కూడా ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీపడి పనిచేసేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, ప్రైవేటీకరింటిన రూట్లలో పనిచేసే ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి ఏంటనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ కారణంగానే ఆర్టీసీ సమ్మెపై ఏదో ఒకటి తేలేవరకు ప్రభుత్వం సైతం వారిని విధుల్లోకి ఆహ్వానించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read also : TSRTC strike issue: టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?