TSRTC Mothers Day Special Gift: ఛార్జీల బాదుడుతో ఓవైపు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ... ఆర్టీసీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రయాణికుల మెప్పు పొందుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 8న మదర్స్ డేని పురస్కరించుకుని... ఆరోజు ఆర్టీసీ బస్సుల్లో చంటిబిడ్డల తల్లులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ ఫ్రీ జర్నీ సదుపాయం వర్తిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీ తాజా నిర్ణయంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ... మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏసీ సర్వీస్ సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 


త్యాగమయి అమ్మ ప్రేమను, అనురాగాన్ని వెలకట్టలేమని... ఆ త్యాగమూర్తి సేవలను గుర్తిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ సామాజిక దృక్పథంతో ముందడుగు వేస్తోందని... ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా రాయితీలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవలే నిరుద్యోగ యువతకు బస్ పాసుల్లో రాయితీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.


Also Read: Nagaraju's Wife Ashreen Reaction: నాగరాజు పరువు హత్య, అశ్రీన్‌ ప్రశ్నలకు బదులేదీ..?


Also Read: Horoscope Today May 7 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.