TSRTC Bus Services : హైదరాబాద్‌లో తెల్లవారుజామున 4గంటల నుంచే ఆర్టీసీ (TSRTC) సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నగరంలోని పలు బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,డిపోల నుంచి తెల్లవారుజామునే బస్సులను నడుపుతోంది.గతంలో కరోనా (Covid 19) నేపథ్యంలో అధికారులు బస్సు సర్వీసుల సంఖ్యతో పాటు ప్రయాణ వేళలను కుదించారు. ఇప్పుడు కరోనా భయాలు తొలగిపోవడంతో బస్సు సర్వీసుల సంఖ్యతో పాటు ప్రయాణ వేళలను పొడగించారు.ఇందులో భాగంగానే తెల్లవారుజాము నుంచే బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో కరోనాకు ముందు ఎలాగైతే తెల్లవారుజామునే బస్సు సర్వీసులు నడిచేవో... ఇప్పుడు కూడా అలాగే బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.రాత్రి 10గంటల వరకు ఆ బస్సులను షెడ్యూల్ చేసినట్లు చెప్పారు.నగరంలోని రైల్వే స్టేషన్లు,బస్ స్టేషన్ల నుంచి ఉదయం 4గంటలకే సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. హయత్‌నగర్, ఫలక్‌నుమా, ఉప్పల్, జీడిమెట్ల, చెంగిచర్ల, మిధాని, మెహిదీపట్నం, హెచ్‌సీయూ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ డిపోల నుంచి తెల్లవారుజాము నుంచే సిటీ బస్సులు (City bus services) అందుబాటులో ఉంటున్నాయన్నారు.


ఉద్యోగులు,విద్యార్థులకు అనువుగా ఉండేలా నగరంలో సిటీ బస్సుల సంఖ్యను కూడా పెంచారు. హయత్‌నగర్-కోఠి మధ్య మరో 12 అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.నేటి (నవంబర్ 10) నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కరోనా మొదటి వేవ్ సమయంలో (Covid 19 first wave) నగరంలో కొన్ని నెలల పాటు సిటీ బస్సు సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే.తిరిగి గతేడాది సెప్టెంబర్‌లో సిటీ బస్సులను పునరుద్దరించారు. మొదట 25 శాతం సిటీ బస్సులనే నడిపారు.క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిటీ బస్సులు అందుబాటులో ఉండగా.. కొన్ని  రూట్లలో అదనపు బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. 


Also Read:Suicide: ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య


ఇక నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు (Hyderabad Metro Rail) కూడా ఉదయం 6 గంటలకే అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు తొలి మెట్రో రైలు ఉదయం 6 గంటలకే బయలుదేరనుంది. చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గమ్య స్థానం చేరుకుంటుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook