హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ( TTDP leaders ) అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ( TTDP chief L Ramana ) నేతృత్వంలో పనిచేయడం ఇష్టంలేని కొంతమంది నాయకులు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటుకు తెరతీశారు. తెలంగాణలో పార్టీ నాయకత్వం మార్చాలని కోరుతూ నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకే ( Chandrababu Naidu ) లేఖ రాశారు. రమణ నాయకుడిగా ఉండగానే రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారని.. పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంలో పడినప్పటికీ గత ఏడేళ్లుగా ఆయననే అధ్యక్ష పదవిలో కొనసాగించడంలో అర్థం లేదని వారు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. Also read : Hyderabad: లక్షణాలు లేని వారితోనే కరోనా ముప్పు!: సర్వే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ పరిస్థితిని, పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చంద్రబాబుకు వివరించిన తిరుగుబాటు నేతలు.. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలనే తమ డిమాండ్‌ని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. Also read : Telangana: తాజాగా 1,302 కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe