MLC Kavitha prepares Ugadi Pachadi: ఇవాళ ఉగాది పర్వదినం కావడంతో తెలుగు లోగిళ్లన్నీ పచ్చని మామిడి తోరణాలతో, రంగురంగుల పూలతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఇంటిల్లిపాదీ కమ్మటి వంటకాలను ఆరగిస్తూ.. ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ పండగను జరుపుకుంటున్నారు. ఈ ఉగాది పండగ పూట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తమ ఇంట్లో స్వయంగా ఉగాది పచ్చడి తయారుచేశారు. ఇంట్లోని పూజ గదిలో పూజ అనంతరం తన స్వహస్తాలతో ఉగాది పచ్చడి తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు, ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామసంవత్సరం అందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని... అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగాది పండగ పూట సేవించే షడ్రుచుల పచ్చడి లాగే జీవితంలోనూ కష్టనష్టాలు, సుఖ దు:ఖాలు ఉంటాయని.. అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీ వెంట ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.


ఈ ఏడాది తెలుగువారంతా శుభకృత్ నామసంవత్సరం జరుపుకుంటుంటే... తెలంగాణ యువ మిత్రులు ఉద్యోగ నామ సంవత్సరంగా జరుపుకుంటున్నారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని అన్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు టీశాట్ యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రసారమయ్యే క్లాసులను ఉపయోగించుకోవాలన్నారు. 



 


Also Read: Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గుండెపోటుతో మృతి!


SRH Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిరసన.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్‌ 'క్యాచ్‌' పంచాయతీ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.