Attack on MP Arvid: ఎంపీ అర్వింద్‌పై మరోసారి దాడి..ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా..!
MP Arvid: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై కొందరు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనను బీజేపీ అగ్ర నేతలు సైతం ఖండిస్తున్నారు.
Attack on MP Arvid: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని కేంద్రమంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. పక్క ప్రకారమే తనపై దాడి జరిగిందని..బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని అమిత్‌షాకు వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీఆర్ఎస్ దాడులు చేస్తోందన్నారు. తాను ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నేతలకు సూచిందని అమిత్ షాకు తెలిపారు. ఇవాళ్టి దాడి వెనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో కొందరు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చనందుకే దాడి జరిగిందని తెలుస్తోంది. ఐతే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారని ఆరోపిస్తున్నారు.
Also read:Hero Sushanth: యాంకర్ పై సుశాంత్ ఆగ్రహం.. ఆ పద్ధతి కరెక్ట్ కాదంటూ ఫైర్!
Also read:CM Jagan: ప్రభుత్వ కష్టం కన్నా..ప్రజల సమస్యలే ముఖ్యం..సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook