Union Minister Bandi Sanjay: ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరితెగించి పాలన చేస్తోంది. అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోంది. శాంతిభద్రతలు అదుపులో లేకుండా పోతున్నయ్. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా, హిందూ ధర్మంపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోంది.’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించి డ్రామాలాడుతోంది. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యారంటీలను దాటవేస్తోందని మండిపడ్డారు. సీఎం హామీ ఇస్తే వెంటనే అమలు చేయాల్సింది పోయి.. అందుకు భిన్నంగా సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఆ పార్టీకి క్యాడర్ లేకుండా పోయిందన్నారు. లీడర్లున్నా.. వాళ్లంతా గోడమీది పిల్లిలా ఇతర పార్టీలవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని ఉద్ఘాటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేయండి


సోమవారం ఉదయం బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లోని తన కార్యాలయంలో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’’ అసోసియేషన్ కు చెందిన వందలాది మంది ఎన్నారైలతో ‘జూమ్’ ద్వారా సంభాషించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అసోసియేషన్ ప్రతినిధులు పవన్, క్రిష్ణారెడ్డి, విలాస్ జంబుల, నిర్మలారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాం రాష్ట్రంలో పరిస్థితులు, సమకాలీన అంశాలపై ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా జవాబిచ్చారు. ఏమన్నారంటే.


"నరేంద్రమోదీ 3వ సారి ప్రధాని అయ్యాక దేశాన్ని కొత్త పంథాలో పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ప్రతి మంత్రిత్వ శాఖ పనితీరు, పురోగతిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తరువాత అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులిస్తున్నా, మ్యాచింగ్ గ్రాంట్లు రిలీజ్ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను వృథా చేసింది. కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళుతోంది. 


కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే... పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. నెలరోజులుగా వడ్లను రోడ్లపై పోసి ఎదురు చూస్తున్నరు. అయినా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించలేదు. రైతులంతా అరిగోస పడుతున్నరు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500లు ఇస్తామని మోసం చేశారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యనేలేదు.  రూ.8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు నోటిఫికేషన్లు ఇస్తోంది...నిబంధనలకు భిన్నంగా ఇస్తున్న నోటిఫికేషన్లను కోర్టులు కొట్టివేసేలా చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతున్నయ్. దేవాలయాలపైన, హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది. 


6 గ్యారంటీలను అమలు చేయడం చేతగాక హైడ్రా, మూసీ, కుల గణన పేరుతో రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది. ఒక సమస్య వస్తే పరిష్కరించకుండా మరో సమస్యను స్రుష్టించి ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తోంది. కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి పొరపాటు చేశామనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం మీడియా ద్వారా ఏదో చేస్తున్నట్లు హైప్ ఇస్తూ ప్రచారం పొందుతోంది.


ఇగ బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనంలోకి వచ్చి ముఖం చూపించలేక ఫాంహౌస్‌కే పరిమితమైండు. బీఆర్ఎస్‌కు క్యాడర్ లేకుండా పోయింది. లీడర్లున్నా వాళ్లంతా ఎప్పుడు ఏ పార్టీలోకి పోదామా? అని గోడమీద పిల్లిలా ఎదురు చూస్తున్నరు. బీఆర్ఎస్ సెక్షన్ మీడియాలో ఏదో పోరాడుతున్నట్లు వార్తలు రాయించుకుని ఆనందపడుతున్నారు. నిజానికి క్యాడర్, లీడర్‌తోపాటు ప్రజా సమస్యలపై కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎన్ని కేసులు ఎదురైనా తెగించి కొట్లాడి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే కసితో కార్యకర్తలున్నరు.     


కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఆగడాలపై బీజేపీ కొట్లాడుతుంటే, దేశాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రగతి పథంలోకి తీసుకెళుతుంటే.. ఓర్వలేకపోతున్నరు. ఈ మధ్య దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే వంటి పార్టీలు దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నయి. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నయ్.


ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో 2028లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా పోరాడేందుకు సిద్ధమైనరు. నేను కేంద్ర మంత్రినైనా సామాన్య కార్యకర్త మాదిరిగానే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, కాంగ్రెస్ అవినీతిపై యుద్దం చేసేందుకు ఉన్నా. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి బీజేపీ కార్యకర్త పోరాటాలకు సిద్ధంగా ఉన్నరు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఆలయాలను తీర్చిదిద్దుతాం. ఆదాయం కోసం కాకుండా హిందూ ధర్మం, ధార్మికత, భక్తి భావం పెంపొందేలా ఆలయాల్లో సేవలందిస్తాం.


విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలంతా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నా. తద్వారా భారతదేశ అభివ్రుద్ధిలో భాగస్వాములు కండి. అట్లాగే ప్రతి ఎన్నారై... సగటున తన వంతుగా కనీసం 5గురు విదేశీ కుటుంబాలను భారత్ లో పర్యటించేలా చేయండి. తద్వారా భారతీయ పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు భారతీయ సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కలుగుతుంది.." అని బండి సంజయ్ అన్నారు.


Also Read: 2025 Astrology: 2025లో ఈ రాశుల వారికీ ఊహించని జాక్ పాట్.. ఉగ్యోగంలో ప్రమోషన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి