PM Modi to Visit Warangal: ఈ నెల 8న వరంగల్‌కు ప్రధాని మోదీ.. భారీగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
Kishan Reddy on PM Modi Warangal Tour: ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Kishan Reddy on PM Modi Warangal Tour: ఈ నెల 8న ప్రధాన మంత్రి ఓరుగల్లు పర్యటనకు వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీకి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కోసం వస్తున్నారని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలోనే మొదటి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసింది వరంగల్ రోడ్డేనని గుర్తు చేశారు. వెయ్యి స్తంభాల గుడి మండపం శిథిలావస్థకు చేరిన వెయ్యి కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తున్నామన్నారు.
"హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకుని RRR రింగ్ రోడ్డు నిర్మాణం నేపథ్యంలో భూ సేకరణ కోసం 500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రూ.26 వేల కోట్లతో రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించింది. భూ సేకరణ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.500 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం. రీజినల్ రింగ్ రోడ్డు సమాంతరంగా అన్ని రైల్వే లైన్‌లకు అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రైల్ ఏర్పాటు చేయనున్నాం.. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు సర్వే చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించింది.
భక్తులు ప్రజల సౌకర్యార్థం యాదాద్రి వరకు 330 కోట్లతో MMTS రైలును విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకోవడంతో ఎంఎంటీఎస్ విస్తరణ ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకపోయిన తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి నిర్మాణం చేసేందుకు నిర్ణయించింది. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్‌తో పాటు వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యం కలిగిన ఈ పరిశ్రమకు సంబంధిచిన పూర్తి వివరాలు ప్రధాన మంత్రి ఆదేశాలతో వెల్లడిస్తాం..
వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగాన్ తయారీ పరిశ్రమ ప్రధాన మంత్రి ఇచ్చారు. దీనికి భూమి పూజ చేసి స్వయంగా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రూ.587 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 1127 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే, 5587 కోట్లతో నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.." అని కిషన్ రెడ్డి తెలిపారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధితో పాటు చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం చిత్తశుద్ధితో కేంద్రం కృషి చేస్తోందన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరున్న ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండ అభివృద్ధే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వరంగల్‌కు వస్తున్న ప్రధాన మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. తెలంగాణ నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: West Indies Team: పసికూనల చేతిలో పరాజయం.. వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి