Pakistan hackers: కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాకింగ్ బారినపడింది ( Union minister Kishan Reddy`s personal website hacked ). పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.
హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాకింగ్ బారినపడింది ( Union minister Kishan Reddy's personal website hacked ). పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్ ( Pakistan hackers ).. అందులో భారత్‌కి వ్యతిరేకంగా పలు పోస్టులు పెట్టారు. ''హ్యాపీ ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్.. హ్యాక్డ్ బై మిస్టర్ హెచ్‌ఏకే.. పాకిస్తాన్ జిందాబాద్ '' అంటూ ఇష్టం వచ్చిన రాతలు రాశారు. కశ్మీర్‌కి విముక్తి కల్పించాల్సిందిగా అందులో పేర్కొన్న హ్యాకర్స్.. ఫిబ్రవరి 27వ తేదీని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరించారు. Also read : Online sex racket: ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి.. వేశ్యలుగా మార్చి..
ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించిన కార్యాలయం సిబ్బంది వెంటనే హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అవడానికి ముందు ఆయన ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించేవారు. ఐతే, కేంద్ర మంత్రి అయ్యాక ఆయన ఈ వెబ్‌సైట్‌ను అంతగా ఉపయోగించడం లేదని కార్యాలయం సిబ్బంది పోలీసులకు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు ( Cyber crime police ) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also read : Bride cheats groom: వరుడి కళ్ల ముందే వధువును ముద్దు పెట్టుకున్న ప్రియుడు