హుజూరాబాద్: పెళ్లి చేసుకుని బరాత్ ముగించుకుని ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వధువుతో ( Newly married bride ) కలిసి ఇంటికి వెళ్తున్న వరుడికి ( Groom ) అదే నవ వధువు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆ వధువు.. తన పెళ్లిని తానే పెటాకులు చేసుకోవడానికి పథకం ప్రకారం తనే ప్రియుడికి ఫోన్ చేసి ఐడియా చెప్పింది. తాము పెళ్లి చేసుకుని వెళ్తున్న విషయాన్ని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పడంతో అక్కడికి చేరుకున్న ప్రియుడు ( Bride's lover ).. ఆమె భర్త కళ్ల ముందే ఆమెను ముద్దుపెట్టుకొని అక్కడ రచ్చరచ్చ చేశాడు. తన ప్రియురాలిని తనకే వదిలేసి వెళ్లాల్సిందిగా వరుడితో ఘర్షణకు దిగాడు. దీంతో సీన్ కాస్తా పోలీసు స్టేషన్‌కి షిఫ్ట్ అయింది. Also read : Unlock 4.0: మెట్రో రైలు, థియేటర్లు, విద్యా సంస్థలకు నో చెబుతున్న జనం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్‌కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో ఇటీవలే పెళ్లి ( Arranged marriage ) కుదిరింది. ఐతే, హుజురాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించిన ఆ యువతికి తల్లిదండ్రులు కుదిర్చిన ఈ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల మాట కాదనలేక ఈ పెళ్లికి అంగీకరించింది. Also read : Online sex racket: ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి.. వేశ్యలుగా మార్చి..
తన ప్రియురాలి పెళ్లి గురించి తెలుసుకున్న వంశీ.. సదరు యువతితో కలిసి ఉన్నప్పటి ఫొటోలు, ప్రేమలేఖలను వరుడికి పంపించి ఈ పెళ్లి రద్దు చేసుకోవాల్సిందిగా బెదిరించాడు. కానీ వంశీ బెదిరింపులను లెక్కచేయని వధూవరుల తల్లిదండ్రులు.. సోమవారం రాత్రి మొత్తానికి అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించారు. Also read : SS Rajamouli: 2040 లక్ష్యంగా రాజమౌళి సినిమా ?
పెళ్లి అనంతరం బరాత్ ముగించుకుని వరుడి ఇంటికి బయల్దేరిన జంటను వంశీ ఇలా అటకాయించి సీన్ క్రియేట్ చేశాడు. ఈ విషయం కాస్తా పోలీసు స్టేషన్ వరకు చేరడంతో పోలీసులు అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ ( Police councelling ) నిర్వహించారు. పోలీసులు ఎంత కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇరువర్గాల వారు పోలీసుల మాట వినిపించుకోలేదు. ఆఖరికి వరుడు వధువును పోలీసుస్టేషన్‌లోనే వదిలేసి మందమర్రికి వెళ్లిపోగా.. వధువు తల్లిదండ్రులు సైతం కూతురుని పోలీసు స్టేషన్‌లోనే వదిలి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఆ నవ వధువును కరీంనగర్‌లోని స్వధార్ హోంకు తరలించారు. Also read : OTT పై యాంకర్ ప్రదీప్ సినిమా
నవ వధువును ముద్దు పెట్టుకొని మొత్తం వివాదానికి కారకుడైన ఆమె ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం ( SC/ST attrocity act ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు మీడియాకు తెలిపారు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనియాంశమైంది. Also read : Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు