Nirmala Seetharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో రెండవ రోజు  పర్యటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో పర్యటించిన కేంద్రమంత్రి రేషన్ షాపును సందర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్  ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు క్లాసీ పీకారు నిర్మలా సీతారామన్. రేషన్ బియ్యం లో కేందం వాటా ఎంత అని అడిగారు. అయితే వెంటనే సమాధానం చెప్ప లేక పోయారు కలెక్టర్  జితేష్ పాటిల్. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..అర గంట టైం తీసుకొని చెప్పాలని కలెక్టర్ ను ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేషన్ షాపు దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్ ప్రశ్నించారు కేంద్రమంత్రి. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుందని ప్రజలకు ఎందుకు చెప్పటం లేదని కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల సీతారామన్.పేదలకు పంపిణీ చేసే బియ్యం వాటాలో కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 రూపాయలు మాత్రమే ఇస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆ సాయం గురించి జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు చెప్పాలని  సూచించారు. రేషన్ షాపు దగ్గర ప్రధాని మోడీ ఫ్లైక్సీని ఈ రోజు సాయంత్రం వరకు పెట్టకపోతే  తానే వచ్చి కడతాననీ జిల్లా కలెక్టర్ కు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.


అంతకుముందు బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.


Read also: Viral Video: జనాల ముందే ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. వైరల్ వీడియో


Read also: Whatsapp Case: ఇదేందయా ఇది.. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు.. పోలీసులు ఏం చేశారో తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook