Whatsapp Case: ఇదేందయా ఇది.. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Whatsapp Case: వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్న పోస్టులు వివాదాలకు కారణమవుతున్నాయి. ఘర్షణలు జరుగుతున్నాయి. వాట్సాప్ పోస్టులకు సంబంధించిన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులకు వచ్చిన ఫిర్యాదు వెరైటీగా ఉంది.  

Written by - Srisailam | Last Updated : Sep 2, 2022, 11:11 AM IST
  • జడ్చర్లలో వాట్సాప్ గ్రూప్ రగడ
  • గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు
  • గ్రూప్ నుంచి వైదొలిగిన కౌన్సిలర్
Whatsapp Case: ఇదేందయా ఇది.. వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశారంటూ కేసు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Whatsapp Case: వాట్సాప్.. ఇది ఇప్పుడు జనాల క్రేజీ యాప్. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒకరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. వాట్సాప్ వచ్చాక సమాచార వ్యాప్తి మరింత సులభతరం అయింది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో జనాలకు చేరుతోంది. వాట్సాప్ తో ప్రయోజనాలతో పాటు అనర్ధాలు కూడా అలానే ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్న పోస్టులు వివాదాలకు కారణమవుతున్నాయి. ఘర్షణలు జరుగుతున్నాయి. వాట్సాప్ పోస్టులకు సంబంధించిన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులకు వచ్చిన ఫిర్యాదు వెరైటీగా ఉంది.

ఇప్పటివరకు వాట్సాప్ లో పోస్టు చేసిన పోస్టుల గురించి పోలీసులకు ఫిర్యాదులు రాగా.. జడ్చర్ల పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మాత్రం తమను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు అని. వాట్సాప్‌ గ్రూప్‌లో అడ్మిన్‌గా చేరి తర్వాత తమనే గ్రూపు నుంచి తొలగించారంటూ ఇద్దరు వ్యక్తులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన యువకులు చైతన్య, వసీం మున్సిపాలిటీలోని 25న వార్జు పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియోట్ చేశారు. వార్డుకు సంబంధించిన సమస్యలు, వివరాలు అందులో పోస్టు చేసేవారు. అయితే 25వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న లత తనను గ్రూప్ లో యాడ్ చేయాలని కోరింది. దీంతో ఆమెను గ్రూప్ లో యాడ్ చేశారు. అంతేకాదు కౌన్సిలర్ కు అడ్మిన్ అవకాశం కూడా ఇచ్చారు చైతన్య, వసీం.

ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాతే సమస్యలు వచ్చాయి. కౌన్సిలర్ తో చైతన్య, వసీంకు విభేదాలు వచ్చాయి. అవి మరింత ముదరడంతో అడ్మిన్ గా ఉన్న కౌన్సిలర్ లత... చైతన్య, వసీంను గ్రూప్ నుంచి రిమూవ్ చేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు చైతన్, వసీం. తాము గ్రూప్ లో జాయిన్ చేస్తే.. ఇప్పుడు తమనే గ్రూప్ నుంచి తొలగించిందంటూ తమ ఫిర్యాదులో వెల్లడించారు. తమ వాట్సాప్ గ్రూపును తమకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీసుకున్న జడ్చర్ల పోలీసులు.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు తనపై పోలీసులకు వచ్చిన ఫిర్యాదుపై కౌన్సిలర్ లత స్పందించారు. ఫిర్యాదుతో తాను ఆ గ్రూప్‌నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. గ్రూపులో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకే తొలగించాలని చెప్పారు. తాను మరో కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు కౌన్సిలర్ లత.

Read also: INS Vikrant: భారత అమ్ముల పొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. నేడు నావిక దళానికి అప్పగించనున్న ప్రధాని మోదీ

Read also: చేతులెత్తేసిన హరిహర వీరమల్లు నిర్మాత.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News