Viral Video: జనాల ముందే ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. వైరల్ వీడియో

MLA Slapped by Her Husband: దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా క్రైమ్ మాత్రం తగ్గడం లేదు.సామాన్య మహిళలే కాదు ఉన్నతస్థానంలో ఉన్నవారికి వేధింపులు తప్పడం లేదు.పంజాబ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే దాడికి గురికావడం కలకలం రేపుతోంది.

Written by - Srisailam | Last Updated : Sep 2, 2022, 12:16 PM IST
  • ఎమ్మెల్యేలకు తప్పని వేధింపులు
  • జనం ముందే ఎమ్మెల్యేను కొట్టిన భర్త
  • పంజాబ్ లో వైరల్ గా మారిన వీడియో
Viral Video: జనాల ముందే ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. వైరల్ వీడియో

MLA Slapped by Her Husband: దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా క్రైమ్ మాత్రం తగ్గడం లేదు. సామాన్య మహిళలే కాదు ఉన్నతస్థానంలో ఉన్నవారికి వేధింపులు తప్పడం లేదు.  పంజాబ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే దాడికి గురికావడం కలకలం రేపుతోంది. జనాలు అంతా చూస్తుండగానే ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేశాడు. ఎమ్మెల్యే నివాసంలోనే జరిగిన ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగినా.. తాజాగా వీడియోలు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పంజాబ్‌లోని తాల్వండి సాబో అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు బల్జిందర్‌ కౌర్‌.  తాల్వండి సాబో నుంచి ఆమె వరుసగా రెండుసార్లు గెలిచారు. ఆమె భర్త సుఖ్‌రాజ్‌ సింగ్‌ ఆప్‌ యూత్‌ విభాగ కన్వీనర్‌ . ఇద్దరి మధ్య ఎదో వివాదం జరిగింది. ఎమ్మెల్యే నివాసంలోనే వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే బంధువులు, స్థానికులు చూస్తుండగానే గొడవ పడ్డారు. వాగ్వాదం సాగుతుండగానే ఆగ్రహానికి లోనైన సుఖ్‌రాజ్‌.. అందరూ చూస్తుండగానే తన భార్య అయిన ఎమ్మెల్యే బల్జిందర్‌పై చేయి చేసుకున్నాడు. వెంటనే బంధువులు జోక్యం చేసుకుని ఇద్దరిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యేపై దాడి జరిగిన వీడియో ఆలస్యంగా బయటికి వచ్చింది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేసిన ఘటనపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మహిళలు ఎక్కడున్నా వేధింపులు తప్పవని కామెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేయడం దిగ్భ్రాంతికరమని, ఇకనైనా పురుషుల ఆలోచనాధోరణి మారాలని కొందరు పోస్టులు పెట్టారు. ఈ ఘటనపై పంజాబ్‌ మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ మనీశా గులాటీ ఫైరయ్యారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న మహిళ ఇంట్లోనే దాడికి గురి కావడం దారుణమని అన్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ ప్రకటించింది. మరోవైపు దాడిపై ఎమ్మెల్యే పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. 

Read Also: తొడకొట్టాడు తెలుగోడు.. అభిమానులకు పండగే పో! గూస్‌బంప్స్ తెస్తోన్న 'పవర్ గ్లాన్స్'

Read Also: CM Jagan: సీఎం జగన్ తో ముద్దుముద్దుగా మాట్లాడిన బాలిక మృతి.. అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News