Kodada Development Works: భార్యాభర్తలు ఇద్దరూ ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. భర్త మంత్రిగా ఉండగా.. భార్య ఎమ్మెల్యే ఉండడంతో ఆ రెండూ నియోజకవర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భర్త అయిన మంత్రి తన భార్యకు భారీ గిఫ్ట్‌ ఇచ్చారు. భార్యతో కలిసి ప్రజలతో ఆ మంత్రి పంచుకున్నారు. భార్యకు ఏం గిఫ్ట్‌ ఇచ్చారు? వారిద్దరూ ఏం చేశారనేది తెలుసుకోండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Auto Jac Bandh: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. ఆరోజు నగరంలో ఆటోలు బంద్‌


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలుగా భార్యాభర్తలైన పద్మావతి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. మంత్రిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక హుజుర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్‌ తన భార్య నియోజకవర్గం కోదాడపై నిధుల వరద పారించారు. ఒక్క రోజే రూ.142 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్‌ రావు


కోదాడ నియోజకవర్గంలో తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మంత్రి ఉత్తమ్‌ సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. మోతే, నడిగూడెం, కోదాడ, అనంతగిరి, మునగాల మండలాల్లో పర్యటించి రూ.142 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 150 కాన్వాయ్‌లతో ఉత్తమ్‌, పద్మావతి బల ప్రదర్శన చేపట్టినట్లు కనిపించింది. వీరి పర్యటనకు భారీ ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అభివృద్ధి పనులు ఇలా..


  • సుమారు రూ.142 కోట్లతో ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 5 డబుల్ రోడ్డు , ఒక ఫోర్ వే లేన్ విస్తరణకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు.

  • రూ.25 కోట్లతో మోతెలో జాతీయ రహదారి 9 నుంచి మోతె వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ డబుల్ రోడ్డుకు శంకుస్థాపన

  • రూ.20 కోట్లతో నడిగూడెం మండలం బరాఖత్ గూడెం నుంచి కాగిత రామచంద్రాపురం వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ డబుల్ రోడ్డు పనులు ప్రారంభం.

  • రూ.25 కోట్లతో నడిగూడెంలో శాంతినగర్ నుంచి నడిగూడెం వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ డబుల్ రోడ్డుకు శంకుస్థాపన

  • రూ.16 కోట్లతో  రత్నవరంలో ఆకుపాముల నుంచి రత్నవరం వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ డబుల్ రోడ్డు పనులు

  • రూ.18 కోట్లతో  కోదాడలో లారీ ఆఫీస్ నుంచి కొమరబండ జంక్షన్ వరకు  ఆర్‌ అండ్‌ బీ బీటీ నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన

  • రూ. 8 కోట్లతో  కోదాడలో ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం, ఆర్‌ అండ్‌ బీ సబ్ డివిజన్ కార్యాలయా నిర్మాణ పనులు ప్రారంభం

  • రూ.20 కోట్లతో అనంతగిరిలో చనుపల్లి నుంచి అనంతగిరి వరకు ఆర్‌ అండ్‌ బీ బీటీ డబుల్ రోడ్డుకు శంకుస్థాపన

  • రూ.10 కోట్లతో మునగాల మండలం ఆకుపాములలో నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి శంకుస్థాపన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.