వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కిటకిట
జూన్ 8 నుంచి లాక్‌డౌన్5.0 ఫేజ్ 1 నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆలయాలు, మత సంబంధమైన ప్రార్థనా స్థలాలు (Raja Rajeshwara Swamy Temple) తెరుచుకున్నాయి.
వేములవాడ: లాక్‌డౌన్5.0 (LockDown 5.0)లో భాగంగా నేటి నుంచి కొన్ని నిబంధనలు సడలించారు. వీటిలో భాగంగా ఆలయాలు, ప్రార్థనా స్థలాలు తెరుచుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం (Raja Rajeshwara Swamy Temple) తలుపులు దాదాపు 80 రోజుల తరువాత నేటి ఉదయం తెరుచుకున్నాయి. అందులోనూ సోమవారం కావడంతో రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ పనులు మాత్రం చేయొద్దు: సోనూ సూద్ విజ్ఞప్తి
ఆలయ పార్కింగ్ స్థలం నుంచి క్యూ లైన్లు ప్రారంభమయ్యాయి. ఆలయానికి వస్తున్న భక్తులకు తొలుత థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. కాళ్లు, చేతులు కడిగిన అనంతరం భౌతికదూరం పాటించాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. రాజన్న ఆలయ ఈవో రామకృష్ణారావు నేటి ఉదయం క్యూ లైన్లను పరిశీలించారు. కాగా, నిబంధనల ప్రకారం 65ఏళ్లు పైబడిన వారితో పాటు 10ఏళ్ల లోపు చిన్నారులను ఆలయంలోకి అనుమతించడం లేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్