Venu swamy and srivani Sensational comments on journalist murthy: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తలలో నిలిచారు.ఈ సారి ఆయన తన భార్య శ్రీవాణి తో కలిసి వీడియోను విడుదల చేశారు.జర్నలిస్ట్ మూర్తి తమకు 5 కోట్లు అడుతున్నాడని, ఇవ్వకపోవడం వల్లే వేధిస్తున్నారని ఆరోపించారు. మూర్తి 2017 నుంచి మాపై చెడు ప్రసారం చేస్తున్నాడని అన్నారు. 8 నెలలుగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయని కూడా వేణు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలో 15 కేజీల బరులు తగ్గిపోయానంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మరోవైపు వేణు స్వామీ సతీమణి సైతం.. 5 కోట్లంటే మాటలా.. తమ బంగారం అంతా అమ్మిన కూడా అంత ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉందని కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ డబ్బుల్ని మేం ఇవ్వలేం. మమ్మల్ని ఎలాగైన చంపేస్తారంటూ కూడా సంచలన వీడయో విడుదల చేశారు. నా చావు వెస్ట్ కావొద్దు.


ఒక వేళ..నేను ఆత్మహత్య చేసుకుంటే.. వేణు స్వామి మీద అలిగేషన్స్ వల్ల ఆయన సతీమణి చనిపోయిందని అంటారు. ఇది ఇన్ డైరెక్ట్ గా మర్డర్ అని కూడా శ్రీవాణి అన్నారు. తమ వల్ల కొంత మంది అయిన.. ఇలాంటి దురాగతాల నుంచి బైటపడతారని ఈ వీడియో చేస్తున్నట్లు వేణు స్వామిదంపతులు చెప్పారు.  అందుకే తామకు ఆత్మహత్య తప్ప మరో మార్గంలేదని కూడా.. సంచలన వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా  మారింది. 


ఇటీవల  కాలంలో వేణు స్వామి తరచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. నాగచైతన్య, శోభితా ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ జరినప్పటి నుంచి మరోసారి ఆయన ట్రెండింగ్ గా మారాయి.  వీరిద్దరు కూడా గొడవలు పడి 2027లో విడిపోతారంటూ బాంబు వేశారు.  తాను ఒకమ్మాయి జీవితం నాశనం కావొద్దని చెబుతున్నట్లుల క్లారిటీ  ఇచ్చారు. మరోవైపు.. సమంతాకు తొందరలనే మంచి సంబంధంకుదురుతుందన్నారు. ఆమెను టార్గెట్ చేసినట్లు తనను కూడా కొంత మంది వేధిస్తున్నారని అన్నారు.


Read more: King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..


ఇక మరోవైపు.. వేణు స్వామి దంపతుల వ్యాఖ్యలపై.. కొంత మంది మహిళ కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై మహిళ కమిషన్ సైతం వేణు స్వామి తమ ముందు హజరు కావాలంటూ సీరియస్ అయ్యింది. మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా వేణు స్వామితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయనతాజాగా... విడుదల చేసిన వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేసందని చెప్పుకొవచ్చు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి