Venu swamy Hot comments on Telugu industry on Samantha issue: వివాదాలకు కేరాఫ్ గా మారిన వేణు స్వామి మరోసారి సమంత పెళ్లి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన 2013 లో సమంత, చైతుల  ఎంగెజ్ మెంట్ జరిగినప్పుడు.. వీరిద్దరు విడిపోతారంటూ కూడా చెప్పారు. ఆయన చెప్పిన విధంగా తర్వాత వైవాహిక జీవితంలో విబేధాలు రావడంతో చైతు,సమంతలు విడిపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా, వేణు స్వామి మరోసారి చైతు, శోభితా ధూళిపాళ్ల ఎంగెజ్ మెంట్ కూడా జాతకం చెప్పారు. వీరిద్దరు సైతం విడిపోతారంటూ రచ్చచేశారు. ఇది కాస్త ముదిరి రచ్చగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏకంగా వేణు స్వామి వ్యవహారం మహిళ కమిషన్ కు ఫిర్యాదుచేయడం వరకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో తాజాగా, వేణు స్వామి మరల ఒక వీడియోను విడుదల చేశారు. సమంతా గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మాట్లాడారు. 2013 లో తాను చెప్పిన విధంగానే సమంతా, చైతు విడియారన్నారు. ఆతర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఎవరు కూడా అండగా నిలవలేదన్నారు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి పోయి.. మయోసైటిస్ కు గురైందని అన్నారు. మరల ఆమె ఎంతో ధైర్యంతో కోలుకుని, ప్రస్తుతం మరల హీట్ సినిమాలు చేస్తుందన్నారు.


కన్నడ,తమిళ ఇండస్ట్రీలు ఆదరించిన విధంగా.. తెలుగు ఇండస్ట్రీ సమంతాను ఆదరించట్లేదని వేణుస్వామి అన్నారు. ఆమె ఇక్కడి అమ్మాయి కాక పోవడం వల్లే... ఇలా చేస్తున్నారని వేణు స్వామి అన్నారు. కొందరు కావాలని సమంతా వ్యవహారం సైడ్ ట్రాక్ కు వెళ్లేలా చేసి..తనపై లేని పోనీ విధంగా ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.


Read more: Viral video: బాప్ రే.. నరాలు తెగే ఉత్కంఠ.. సింహాలు, కుక్కల ఫైటింగ్.. సడెన్ గా తెర్చుకున్న గేట్.. ఆ తర్వాత..


అయిన కూడా తాను గతంలో ఒక అమ్మాయికి జాతకం చెప్పాను.. ఇప్పుడు కూడా మరో అమ్మాయి జీవితం ఇబ్బందులు పాలు కావోద్దని జాతకం చెప్పానని వేణు స్వామి క్లారీటీ ఇచ్చారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీలు సమంతను ఆదరిస్తున్నాయని, సామ్ ను వాళ్లు ఎంతొ అర్ధంచేసుకున్నారని వేణు స్వామి అన్నారు. అంతేకాకుండా.. సమంతా అతి తొందరలో మరో పెళ్లి చేసుకుని, పిల్లపాపలతోసంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వేణుస్వామి స్పష్టం చేశారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter