Viral video: బాప్ రే.. నరాలు తెగే ఉత్కంఠ.. సింహాలు, కుక్కల ఫైటింగ్.. సడెన్ గా తెర్చుకున్న గేట్.. ఆ తర్వాత..

Gujarat savarkundla news: సావర్ కుండ్లాలో అడవిలో నుంచి రెండు సింహాలు సమీపంలోని గోశాలకు వచ్చాయి. అక్కడ పెద్ద గేటు ఉంది.  ఇంతలో చప్పుడు కావడంతో కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. సింహాలను చూసి గట్టిగా అరవడం మొదలెట్టాయి. ఈ వీడియో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 14, 2024, 04:30 PM IST
  • సింహాలకు చుక్కలు చూపించిన కుక్కలు..
  • గుజరాత్ లో షాకింగ్ ఘటన..
Viral video: బాప్ రే.. నరాలు తెగే ఉత్కంఠ.. సింహాలు, కుక్కల ఫైటింగ్.. సడెన్ గా తెర్చుకున్న గేట్.. ఆ తర్వాత..

2 dogs barking on 2 lions fighting savarkundla Gujarat video: సోషల్ మీడియాలో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వెరైటీ సంఘటనలు, షాకింగ్ కు గురిచేసేవిగా ఉంటే అలాంటి వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా ఈ కంటెంట్ ఉన్న వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా కొన్ని జీవులు కొన్ని చోట్ల మాత్రమే.. అవిబలంగా ఉంటాయి.

 

మొసళ్లు నీళ్లలో ఉంటే బలంగా ఉంటాయి. ఆ సమయంలో ఎంత బలవంతమైన ఏనుగుల్ని అయిన నీళ్లలోనికి లాగేసుకుంటాయి. ఇక కుక్కలు తమ యజమానులు చుట్టుపక్కల ఉంటే రెచ్చిపోతాయి. అవతల ఎవరున్నారనేది అస్సలు లెక్కచేయవు. అచ్చం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

 గుజరాత్‌  సావర్‌కుండ్లాలోని ఓ గోశాలలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన  సంభవించింది. అడవిలో నుంచి రెండు ఆసియాసింహాలు బైటకు వచ్చాయి. అవి దగ్గరలోని గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ గేటు ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాయి. అప్పుడు చప్పుడు కావడంతో .. కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అవి గేటుకు అవతల ఉన్నా..సింహాల మీదకు గట్టిగా అరుస్తు ఫైటింగ్ కు వెళ్లాయి.  సింహాలు కూడా గేట్ ను తోసేస్తు.. గట్టిగా గాండ్రించాయి. కానీ కుక్కల లక్ బాగుందో ఏంటో కానీ.. ఆ గేట్ మాత్రం తెరుచుకోలేదు. కాసేపటి తర్వాత సింహాలు మరల అడవిలోకి వెళ్లిపోయాయి.

అంతలో..కాసేపటికి వాటి యజమాని నిద్రలేచి లైటు వేసుకుని అక్కడికి వస్తాడు. గేటు బయటికి వెళ్లి లైటు వేసి అటూ, ఇటూ చూశాడు. అయితే సింహాలు వెళ్లిపోవడంతో ఏమీ కనిపించలేదు. దీంతో చివరకు ఆ వ్యక్తి గేటుకు తాళం వేసి లోపలికి వెళ్లిపోయాడు.ఈ ప్రాంతం గిర్ నేషనల్ పార్కుకు దగ్గరలో ఉంది. ఈ ఘటన అంతా.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

Read more: Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన కుక్కలు’’.. అంటూ కామంట్లు చేస్తున్నారు. మరికొందరు కుక్కల దెబ్బకు తోకముడిచిన సింహాలు అంటూ..‘‘కుక్కల దెబ్బకు భయపడి పారిపోయిన సింహాలు’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పొరపాటున ఆ సింహాలు అక్కడే ఉంటే.. గేట్ ఓపెన్ చేసిన వ్యక్తి పరిస్థితి ఏంటని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News