HEAVY RAINS:తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు పంజా విసిరాడు. విరుచకుపడ్డారు. వరుణ ప్రతాపంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది. నాలుగైదు గంట్లోనే ఏకంగా 300 నుంచి 200 మిల్లిమీటర్ల   వర్షం కురిసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డ్ స్ఠాయిలో వర్షాలు కురిశాయి. పాత రికార్డులన్ని బద్దలయ్యాయి. అత్యంత భారీ వర్షాలు కురవడంతో వరద పోటెత్తింది. పంటపొలాలు, గ్రామాలు మొత్తం చెరువులుగా మారిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం శనివారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో వర్షం కురిసింది. మధ్యాహ్నాం సమయంలో  ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురవగా.. రాత్రి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో మేఘం బద్దలైందా అన్నట్లుగా కుంభవృష్ఠి కురిసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోన దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్ పూర్ లో ఏకంగా 347 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కాటారంలో రికార్డ్ స్థాయిలో 333 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. 24 గంటల్లోనే 34 సెంటిమీటర్లకు పైగా వర్షం కురవడం రికార్డ్ అంటున్నారు అధికారులు. భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేవలం  ఐదారు గంటల్లోనే 250 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.  


భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లో 247, నిర్మల్ జిల్లా ముదోల్ లో 229,  పెద్దపల్లి జిల్లా రామగుండంలో  223, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 219, నిర్మల్ జిల్లా బైంసాలో  192, నిజామాబాద్ జిల్లా నవీపేటలో  191, మదన్ పల్లిలో 175, మాచరల్లో 174, మగిడిలో 164, రాంజల్ లో 163, ఇస్సపల్లిలో 160, జక్రాన్ పల్లిలో 158 మిల్లిమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో కుంభవృష్ణి కురవగా.. 64 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం.. 158 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 


Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!


Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook