Villagers attacks on vikarabad collector video: తెలంగాణలోని వికారాబాద్  జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ను, కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడికి దిగారు. అంతే కాకుండా.. వాహానాలను ధ్వంసం చేసి పరుగెత్తించి మరీ కొట్టినట్లు తెలుస్తొంది. అయితే.. ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు ఆయా గ్రామాల రైతులతో సమావేశం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు.. కలెక్టర్ డౌన్ డౌన్..  సీఎం డౌన్ డౌన్ అంటూ ఒక్కసారి కలెక్టర్ మీదకి దూసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కలెక్టర్ కార్ పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతే కాకుండా.. kada చైర్మన్ వెంకట్ రెడ్డి పై కూడా దాడికి తెగబడ్డారు. కలెక్టర్ మీద రాళ్ళు, కర్రలతో  రైతులు, గ్రామస్థులు దాడిచేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వికారాబాద్ లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలెక్టర్ కు చెందిన మూడు వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతానికి భారీగా పోలీసుల మోహరించినట్లు తెలుస్తొంది.


కలెక్టర్ పై ఒక మహిళ.. చేయి చేసుకున్నట్లు తెలుస్తొంది. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లాగా వీరికి ఈ విధంగా షాకింగ్ అనుభవం ఎదురైనట్లు తెలుస్తొంది.


Read more: KTR VS CM Revanth Reddy: రేవంత్ ఒక చిచోరా సీఎం.. మళ్లీ రెచ్చిపోయిన కేటీఆర్..ఏమన్నారంటే..?  


మెయిన్ గా.. గ్రామానికి  2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు నిరసన తెలిపినట్లు సమాచారం. వారి అభ్యంతరంతో గ్రామానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మార్వోపై రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో విరారాబాద్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తొంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.