Mgm Hospital: తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌. వరంగల్‌ కేంద్రంగానే ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కైన ఎంజీఎం హాస్పిటల్‌ ఉంది. ఈ హాస్పిటల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకే ఈ హాస్పిటల్‌ ను ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పిలుస్తారు. మరి అలాంటి హాస్పిటల్‌ లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బంధువులు ఉంటేనే హాస్పిటల్‌ లో అడ్మిట్‌ చేసుకుంటామని తెగేసి చెప్పారు. దీంతో ఆ రోగి గతవారం రోజుగా హాస్పిటల్‌ ఆవరణలోని ఓ చెట్టునే తన నివాసంగా మలుచుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరంగల్‌ కు చెందిన సంజీవ్‌కు నా అనే వాళ్లు లేరు. ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్‌ అయిన సంజీవ్‌ ఒంటరిగానే జీవితం గడుపుతున్నాడు. నాలుగు నెలల క్రితం సంజీవ్‌ కు కుడి కాలు విరగడంతో ఎంజీఎం హాస్పిటల్‌ వైద్యులే చికిత్స చేశారు. ఆపరేషన్‌ చేసి కాలులోపల రాడ్లు బిగించారు. అయితే కొద్దిరోజుల క్రితం సంజీవ్‌ కాలుజారి మరోసారి కిందపడ్డాడు. దీంతో అప్పుడు బిగించిన రాడ్లు కదిలాయి. దీంతో నొప్పితీవ్రతరమై మరోసారి సంజీవ్‌ ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఎంజీఎం ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. సంజీవ్‌ బాధను అర్ధం చేసుకోవాల్సిన వైద్యులు అతనిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా కేవలం డ్రెస్సింగ్‌ రూంలోకి తీసుకెళ్లి కొత్తగా కట్టుకట్టి వదిలేశారు. అడ్మిట్‌ చేసుకోని చికిత్స అందించాలని కోరితే సంజీవ్‌ పై అక్కడి సిబ్బంది ఫైరయ్యారు. గార్డియన్‌ లేకుండా రోగిని అడ్మిట్‌ చేసుకోలేమని చెప్పేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సంజీవ్‌ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఓ చెట్టు కిందే నివాసం ఉంటున్నాడు. గత వారం రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఇకనైనా వైద్యుల మనసు కరిగి తనను అడ్మిట్‌ చేసుకుంటారోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. వారం రోజులుగా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతూ అక్కడ ఉంటున్నాడు. గత వారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు వరంగల్‌ పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించాడు. ఆ సమయంలో కూడా సంజీవ్‌ అక్కడి చెట్టు కిందనే చికిత్స తీసుకుంటున్నాడు. 



మొత్తంగా తన బాధను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సంజీవ్‌ వాపోతున్నాడు. తన కాలుకు మరోసారి ఆపరేషన్‌ చేసి రాడ్లను సరిచేయాలని కోరుతున్నాడు. లేదా పూర్తిగా కాలునే తొలగించాలని.. విజ్ఞప్తి చేస్తున్నాడు. బంధువులు, గార్డియన్లు లేనప్పుడు ప్రభుత్వమే వారికి పెద్దదిక్కుగా ఉండాలి. సంజీవ్‌ విషయంలోనూ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కాస్త చొరవ తీసుకుని అడ్మిషన్‌ ఇవ్వడంతో పాటు ఓ అటెండర్‌ ను ఏర్పాటుచేయాలి. అప్పుడే సంజీవ్‌ కు మెరుగైన చికిత్స అందుతుంది.


Also Read:Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!


Also Read:Tomato Price Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధర... కిలో రూ.80...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.