Revanth Reddy vs KCR: పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి వ్యవహారం చక్కబడింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సమావేశమైన తర్వాత ఆయన మెత్తబడ్డారు. పార్టీతో జీవన్‌తో కలిసి సమావేశమైన రేవంత్‌ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాలు, రాజకీయాలు తదితర వాటిపై మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MLAs Jump: ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్‌ తీరుతో సీనియర్‌ నాయకుడు రాజీనామా?


 


'పార్టీ ఫిరాయింపు సంస్కృతికి కేసీఆర్‌ తెర లేపారు. ఆయన ముందుగా అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం పడిపోతుందని చెబుతున్న కేసీఆర్‌ను ఏం చేయాలి' అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ 20 శాతం ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందని రేవంత్‌ రెడ్డి ఆరోపిచారు. మోడీ కాళ్లు పట్టుకుని మా ప్రభుత్వం పడేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

Also Read: KTR: ఎమ్మెల్యేల జంప్‌ జిలానీలపై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. మాస్‌ వార్నింగ్‌


 


'విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కావాలనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడిగారు. కేసీఆర్ విద్యుత్ కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించాలి. అది ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు. పీసీసీ బాధ్యతల నుంచి తనను తప్పించి కొత్త వారికి బాధ్యతలు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు. పీసీసీగా తాను సరైన బాధ్యతలు నిర్వహించానని చెప్పుకున్నారు. 


పార్టీ సీనియర్‌ నాయకుడు జీవన్‌ వ్యవహారంపై స్పందిస్తూ.. 'జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తింది. ఆయన అనుభవాన్ని దృష్ఠిలో ఉంచుకొని వారి గౌరవానికి భంగం కలగనివ్వం. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటాం. మా ప్రభుత్వం చేస్తున్న రైతు రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరారు' అని రేవంత్‌ రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.


పరిపాలన విషయాలు మాట్లాడుతూ.. 'మేము సమర్థవంతంగా ప్రభుత్వం నడుపుతున్నాం. ఏ శాఖ కూడా ప్రస్తుతం ఖాళీగా లేదు. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. విద్యా శాఖ సజావుగా అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కొన్ని రోజులుగా చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రేపు వరంగల్‌లో పర్యటిస్తారని సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter