When will KTR become the Chief Minister OF Telangana: మహబూబాబాద్‌: తెలంగాణలో గత రెండేళ్లుగా చర్చకు దారితీసే అంశాలలో ఒకటి మంత్రి కేటీఆర్ సీఎం పీఠం ఎప్పుడు అవుతారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు ఎప్పుడు విరమిస్తారు అని. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)లోనూ అంతర్గతంగా చర్చలు జరుగుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అదే సమయంలో చర్చకు వచ్చే మరో అంశం... కేసీఆర్(KCR) తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా హరీష్ రావు బాధ్యతలు చేపడతారా!. ఇలాంటి విషయం తెరపైకి వస్తున్న కారణంగానే మంత్రి హరీష్ రావుకు పార్టీలో కాస్త ప్రాధాన్యం తగ్గుతుందనే వాదన సైతం లేకపోలేదు. కానీ ప్రధాన ఎన్నికల బాధ్యతల్ని పలుమార్లు మంత్రి హరీష్ రావుకే సీఎం కేసీఆర్ అప్పగించడం చూశాం. ప్రస్తుతం మరోసారి కేటీఆర్ సీఎం అయ్యే అంశం వైరల్ అవుతోంది.


Also Read: West Bengal: మమతా కీలక నిర్ణయం.. తెలుగు భాషకు అధికార హోదా



మార్చి 2021లోపు కేటీఆర్(KTR) తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ అభిప్రాయపడ్డారు. స్థానిక మున్సిపాలిటీకి ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన ట్రాక్టర్లను ఎమ్మెల్యే రెడ్యానాయక్ బుధవారం ప్రారంభించారు. ఇటీవల తాను మంత్రి కేటీఆర్‌ను కలిసి సీరోలు గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని, నర్సింహులుపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.


Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే..



డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూర్ చేయాలని సైతం మంత్రి కేటీఆర్‌ను తాను కోరినట్లు పేర్కొన్నారు. వచ్చే మార్చిలోపు కేటీఆర్ తెలంగాణ (Telangana) సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్ అని ఎమ్మెల్యే రెడ్యానాయక్ వ్యాఖ్యానించారు.


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook