Wine Shops Close: ఇటీవల తరచూ మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. గత నెలలో రెండు మూడు సార్లు మూత పడిన మద్యం దుకాణాలు.. తాజాగా మరో రెండు రోజులు మూత పడనున్నాయి. మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా బంద్‌ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మద్యం విక్రయాలు బంద్‌ చేస్తున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ


లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు భారీ షాకిచ్చింది. మే 11 సాయంత్రం 6 నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇదే కాదు లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కూడా మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ రోజు శంషాబాద్‌లో డ్యూటీ ఫ్రీ షాప్స్ మినహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్స్ మూసివేయనున్నారు.

Also Read: Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?


 


రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రచార గడువు శనివారం వరకు ఉంది. ఆ తర్వాత ఒకరోజు విరామం అనంతరం 13వ తేదీన ఓటింగ్‌ జరగనుంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ దూసుకెళ్తుండగా.. అదే స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, రేవంత్‌ రెడ్డి తదితరులు ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు.


ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అగ్ర నాయకత్వమంతా ప్రచారంలోకి దిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ పరిణామాలు మారాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు కొత్తగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోకపోవడంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ ఏర్పడింది.



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook