3rd Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు మూడో విడతలో భాగంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
18వ లోక్ సభకు జరగుతున్న ఈ ఎన్నికల్లో దేశానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరనేది నిర్ణయిస్తాయి. ఇప్పటికే ఫస్ట్ ఫేస్‌లో భాగంగా ఏప్రిల్ 19న 102 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతో 88 లోక్ సభ సీట్లకు ఎన్నికల క్రతువు పూర్తైయింది. కాసేటి క్రితమే మూడో విడతలో భాగంగా గుజరాత 26 స్థానాలకు గాను ఇప్పటికే సూరత్ ఏక గ్రీవంగా ఎన్నిక జరిగింది. దీంతో అక్కడ 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కర్ణాటక రాష్ట్రంలోని 14 స్థానాలు.. అస్సామ్‌లోని 4 స్థానాలు.. బిహార్‌లోని 5 స్థానాలు.. గోవాలోని 2 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోకి 8+1 కలిపి 9 స్థానాలు.. మహారాష్ట్రలోని 11 స్థానాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని 10 స్థానాలు.. పశ్చిమ బెంగాల్‌లోని 4 స్థానాలు..ఛత్తీస్‌గడ్‌లోని 7 లోక్ సభ సీట్లు.. దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్, రాజౌరి స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా 92 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి.
3వ దశ ఎన్నికల తర్వాత దేశంలో గుజరాత్, అస్సామ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో గుజరాత్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాధిత్య సింధియా (గుణ - మధ్య ప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు. పురుషోత్తం రూపాల రాజ్‌కోట్ నుంచి పోటీలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషి.. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు మధ్య ప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బరిలో ఉంటే.... రాజ్ ఘర్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అటు కర్ణాటకలోని హవేరి నుంచి బసవరాజ్ బొమ్మై ఎంపీగా పోటీ చేస్తున్నారు. అటు మూడో విడతలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని గాంధీ నగర్ లోక్ సభ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మూడో విడతతో దేశ వ్యాప్తంగా 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో నాలుగు విడతల్లో 262 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter