Hyderabad: దారుణం: భర్తకు మద్యం తాగించి.. భార్యపై హత్యాచారం..
Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారు.
Hyderabad Crime news: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతిపేట్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య (Rape And Murder)కు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే..
అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapur Met)లోని ఓ వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో అతని భార్య(Wifez0పై ఆ ఇద్దరు వ్యక్తులు కన్నేశారు. ఎలాగైనా అతన్ని స్పృహ కోల్పోయేలా చేయాలని ఎక్కువగా మద్యం తాగించారు. అనంతరం ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం(Rape) చేశారు. ఆమె ప్రతిఘటించటంతో...మరింత రెచ్చిపోయి ఆమెను హత్య(Murder) చేశారు.
Also Read: Prostitution busted: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార దందా... బట్టబయలు చేసిన పోలీసులు
మత్తు నుంచి తేరుకున్న భర్త విగతజీవిగా పడి ఉన్న భార్యను చూశాడు. ఏమి జరిగి ఉంటుందని ఓ అంచనాకు వచ్చాడు. వెంటనే పోలీసుల(Police)కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్వాడ్‌తో విచారణ చేపట్టారు. నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook