Prostitution busted: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార దందా... బట్టబయలు చేసిన పోలీసులు

Hyderabad Police busted prostitution in the name of spa: మసాజ్ ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక విటుడితో  పాటు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 02:44 PM IST
  • మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార దందా
    బంజారాహిల్స్‌లోని స్పాపై పోలీసుల దాడులు
    ఒక విటుడు, 10 మందికి పైగా యువతుల అరెస్ట్
 Prostitution busted: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార దందా... బట్టబయలు చేసిన పోలీసులు

Hyderabad Police busted prostitution in the name of spa: పేరుకు అదో మసాజ్ సెంటర్... కానీ లోపల జరిగేది వ్యభిచార దందా (Prostituion racket)... కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్‌తో మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడితో పాటు కొంతమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఎలిగెంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా పేర్లతో ఓ వ్యక్తి మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే మసాజ్ సెంటర్ (Massage Parlor) ముసుగులో ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయి. పలువురు యువతులను ఇక్కడికి తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం (నవంబర్ 22) రాత్రి పోలీసులు ఈ మసాజ్ సెంటర్‌పై దాడులు నిర్వహించారు.

Also Read: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

ఈ దాడుల్లో ఒక విటుడితో పాటు 10 మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను బంజారాహిల్స్ (Banjarahills) పోలీసులకు అప్పగించారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం నగరంలోని జీడిమెట్ల పరిధిలోనూ పోలీసులు ఓ వ్యభిచార దందాను బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంజయ్ గాంధీ నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం (Prostitution racket) నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అకస్మాత్తుగా దాడులు నిర్వహించి విటులతో పాటు ఇద్దరు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయి కుమార్ అనే వ్యక్తి నిరుపేద మహిళలకు డబ్బు ఆశ చూపించి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News