Yadadri Temple: ఆదివారం యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో వారాంతపు రోజైనందున భక్తులు భారీగా తరలివచ్చారు.  దీంతో మండపాలు, క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో గుడిని వేకువ జామున గంట ముందే తెరిచి పూజలు నిర్వహించారు. యాదాద్రీశుడి (Lakshmi Narasimha Swamy) ఉచిత దర్శనానికి దాదాపు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం సుమారు 60వేల మంది భక్తులు  శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు అంచనా వేశాయి. యాదాద్రి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. నిన్న రూ.1,09,82,446 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇంత మెుత్తంలో ఆదాయం రావడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు.


కార్తీక మాసం కావడంతో యాదాద్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపారాధనలు చేసుకున్నారు. కొండపైకి బస్సులు లేకపోవడంతో కొందరు భక్తులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మరికొందరు కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి కనిపించింది.


Also Read: Telangana: రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook