YS Sharmila About Dalita Bandhu Scheme: గజ్వెల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్థులు తమకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారని.. అందుకే అక్కడి దళితులకు దళిత బంధు పథకం అమలు అవుతుందో లేదోననే వివరాలు తెలుసుకోవడం గురించి వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీపోలీసులు మేము అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తాము ఇంత శాంతియుతంగా పోరాడుతుంటే.. పోలీసులు మాత్రం కావాలనే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని షర్మిల మండిపడ్డారు. పోలీసులు ఇకనైనా కేసీఆర్ కి తొత్తులుగా పనిచేయడం మానేయాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హులైన వారికి దళిత బంధు అమలు కావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో వేరే చోట్ల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అక్కడికి వెళ్ళలేదు .. ఎందుకు వారి సమస్యలు తీర్చడం లేదని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. 


దళిత బంధు పథకం కేవలం హుజురాబాద్ ఎలక్షన్ కోసమే తీసుకొచ్చిన పథకం కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల కోసం తీసుకొచ్చిన పథకంలా లేదన్నారు. ఒకవేళ దళితుల అభివృద్ది కోసమే దళితుల బంధు పథకం తీసుకొచ్చి ఉన్నట్టయితే.. బంధు పథకం ఫలాలు 17లక్షల మంది దళితులకు రావాల్సి ఉండగా.. కేవలం 34 వేల మందికి మాత్రమే ఎలా ఇస్తారని షర్మిల ప్రశ్నించారు. దళిత బంధు పథకం ఆయన అనుచరుల బంధు పథకంగా మారింది అని షర్మిల ఎద్దేవా చేశారు.


దళిత బంధు పథకం అనేది ఎమ్మెల్యేల చేతుల్లో ఉండకూడదు. అది ఎమ్మెల్యేల చేతుల్లో ఉండటం వల్లే అర్హులైన వారికి కాకుండా వారి అనుచరులకు మాత్రమే లభిస్తోంది అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 38 వేల 5 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మారు. మద్యం ఏరులై పారిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దళిత బంధు పథకంలో అవినీతి భారీ ఎత్తున జరుగుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలిసినప్పటికీ.. అవినీతికి పాల్పడుతున్న వారిపై ఎందుకు చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లేదు అని వైఎస్ షర్మిల కేసీఆర్ ని నిలదీశారు.



ఇది కూడా చదవండి : Revanth Reddy Security Issue: సెక్యూరిటీ తగ్గింపుపై కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్


దళిత బంధు పథకంలో 3 నుండి 5 లక్షల వరకు అవినీతి జరుగుతోంది అని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఅర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అనే పదానికి అర్థం లేకుండా చేస్తోందని మండిపడిన షర్మిల.. డబుల్ బెడ్ రూమ్ పథకం ఏమైంది, డబుల్ బెడ్ రూమ్స్ ఏమయ్యాయి అని నిలదీశారు.


ఇది కూడా చదవండి : Double Bedroom Houses Allotment: త్వరలోనే వాళ్లకి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తాం : మంత్రి కేటీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి