YS Sharmila: విలీనం లేనట్టే, ఒంటరిగా బరిలో దిగనున్న షర్మిల, 119 స్థానాల్లో పోటీ
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంశంపై ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్నించి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila: తెలంగాణలో చాలాకాలంగా ప్రచారంలో ఉన్న వైఎస్సార్టీపీ-కాంగ్రెస్ పార్టీల విలీన అంశానికి దాదాపుగా తెరపడింది. ఇక విలీనం లేదని ఖరారైంది. అటు వైఎస్ షర్మిల సైతం ఒంటరిగా బరిలో దిగేందుకు సంసిద్ధమయ్యారు. పార్టీ అభ్యర్ధుల్ని ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన నినాదంతో తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేపట్టారు. ఈలోగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు రంగంలో దిగి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అంశంపై చర్చలు జరిపారు. అటు షర్మిల కూడా ఈ ప్రతిపాదనకు సిద్ధమయ్యారు.
అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సహా కొంతమందికి ఇది ఏ మాత్రం ఇష్టం లేదు. షర్మిలను ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని సూచించారు. షర్మిల మాత్రం తెలంగాణ స్థానికతనే కోరుకున్నారు. గతంలో 2018లో టీడీపీతో పొత్తుతో మూల్యం చెల్లించుకున్నామనే సాకు చూపించారు. కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్ చర్చలు జరిపి షర్మిల పార్టీ విలీనంతో పాటు ఇతర అంశాలపై దాదాపు లైన్ క్లియర్ చేశారు. కానీ అధిష్టానం తేల్చకపోవడంతో సెప్టెంబర్ 30 డెడ్‌లైన్ విదించిన షర్మిల ఆ తరువాత విలీన ప్రతిపాదనకు తెర దించేశారు.
ఇక ఇప్పుడు విలీనం అంశం దాదాపుగా లేనట్టేనని తేలిపోయింది. ముందుగా అనుకున్నట్టే వైఎస్ షర్మిల ఒంటరిగా పాలేరు నుంచి బరిలో దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల్ని రంగంలో దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి టికెట్ ఆశించే అభ్యర్ధుల దరఖాస్తుల్ని ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు.
Also read: CM KCR: సీఎం కేసీఆర్ దసరా గిఫ్ట్.. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రత్యేక ఆరోగ్య పథకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook